అడవిలో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు..! 1 d ago
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఓ కారులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమయ్యాయి. ఆ కారు అడవిలో పార్క్ చేసి ఉండడంతో పోలీసులు సీజ్ చేసారు. రూ.42 కోట్ల విలువైన బంగారం, రూ.10 కోట్ల డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇటీవల ఐటీ శాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఎవరో వదిలేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.